డింగ్‌కు గుకేశ్‌ ఝలక్‌

Nov 27,2024 21:54
  • మూడోరౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ ఓటమి

సింగపూర్‌: ఫిడే ప్రపంచ ఛెస్‌ ఛాంపియన్‌షిప్‌ మూడోరౌండ్‌లో గుకేశ్‌ విజయం సాధించాడు. బుధవారం జరిగిన మూడోరౌండ్‌ గేమ్‌లో గుకేశ్‌ ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించాడు. తెల్లపావులతో మూడోరౌండ్‌లో ఆడిన గుకేశ్‌ 37ఎత్తుల తర్వాత విజయం సాధించాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్‌ ఓటమిపాలవ్వగా.. మూడోరౌండ్‌లో తెల్లపావులతో ఆడి గుకేశ్‌ను చిత్తుచేయడం విశేషం. తొలిరౌండ్‌లో ఫ్రెంచ్‌ గేమ్‌ను ఎంచుకున్న గుకేశ్‌.. ఆ గేమ్‌లో పరాజయాన్ని చవిచూశాడు. గుకేశ్‌ డి-4తో గేమ్‌ను ప్రారంభించగా.. డింగ్‌ ఎన్‌ఎఫ్‌-6తో గేమ్‌ను మొదలుపెట్టాడు. ప్రపంచ టైటిల్‌కోసం ఇరువురు 14రౌండ్‌లపాటు తలపడనున్నారు. 7.5పాయింట్లు సాధించిన ఆటగాడికి విజయం దక్కనుంది. ఇక మూడోరౌండ్‌ ముగిసిన అనంతరం ఇరువురు 1.5-1.5పాయింట్లతో సమంగా ఉన్నారు. 2022లో చైనాకు చెందిన డింగ్‌ లెరెన్‌ రష్యాకు చెందిన నెపోంనిచ్చిని ఓడించి టైటిల్‌ను చేజిక్కించుకొన్నాడు.

➡️