5వేల మీ. పరుగులో గుల్వీర్‌ జాతీయ రికార్డు

నిగాటా(జపాన్‌): ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌లో గుల్వీర్‌ సింగ్‌ ఒక జాతీయ రికార్డును నెలకొల్పాడు. శనివారం జరిగిన 5వేల మీ. పరుగును 13నిమిషాల 11.82సెకన్లలో గమ్యానికి చేరి గతంలో అవినాశ్‌ శేబల్‌ నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేశాడు. పోర్ట్‌ల్యాండ్‌ వేదికగా జరిగిన ట్రాక్‌ ఫెస్టివల్‌లో అవినాశ్‌ 13నిమిషాల 18.92సెకన్లలో గమ్యానికి చేరి తొలుత జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో 26ఏళ్ల గుల్వీర్‌ 13సెకన్లతో పారిస్‌ ఒలింపిక్‌ అర్హత మార్క్‌ను కోల్పోయాడు. ఇక గుల్వీర్‌ ఈ ఏడాది మార్చిలో కాలిఫోర్నియాలో జరిగిన ది టెన్‌ ట్రాక్‌ మీట్‌లో పురుషుల 10వేల మీ. పరుగును బ్రేక్‌ చేశాడు. ఆ పరుగులును 27నిమిషాల. 41.81సెకన్లలో ముగించి 2008లో సురేందర్‌ సింగ్‌ నెలకొల్పిన 28నిమిషాల 02.89సెకన్ల రికార్డును బ్రేక్‌ చేశాడు.

➡️