వడోధర: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో హర్యానా జట్టు 72పరుగుల తేడాతో బెంగాల్‌పై, రాజస్తాన్‌ను జట్టు 19పరుగుల తేడాతో తమిళనాడు జట్టును ఓడించాయి. రాజస్తాన్ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి 47.3ఓవర్లలో 267పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిజిత్(111) సెంచరీకి తోడు కెప్టెన్ లోమ్రోర్(60) అర్ధసెంచరీతో రాణించారు. తమిళనాడు బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి ఐదు, వారియర్, సాయి కిషోర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భాగంగా తమిళనాడు 47.1ఓవర్లలో 248పరుగులకు కుప్పకూలింది. జగదీశన్(65), విజరు శంకర్(49), మహ్మద్ అలీ(34) రాణించారు. రాజస్తాన్ బౌలర్లు అమన్‌కు మూడు, అంకిత్, అజరుసింగ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిజిత్ థోమర్‌కు దక్కింది. మరో మ్యాచ్‌లో హర్యానా జట్టు నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 298పరుగులు చేయగా.. ఛేదనలో భాగంగా బెంగాల్ 43.1ఓవర్లలో 226పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ మహ్మద్ షమీ(3/61) బౌలింగ్‌లో మెరిసాడు. శని, ఆదివారం క్వార్టర్‌ఫైనల్స్, 15, 16న సెమీఫైనల్స్ జరగనున్నాయి. 18(శని) టైటిల్ పోరు జరగనుంది.
క్వార్టర్‌ఫైనల్స్: 11(శని) : మహారాష్ట్ర × పంజాబ్, కర్ణాటక × బరోడా
12(ఆది) : గుజరాత్ × హర్యానా, విదర్భ × రాజస్తాన్