టెక్సాస్: దిగ్గజ అమెరికా బాక్సర్ జార్జ్ ఫోరెమాన్(76) కన్నుమూశారు. రెండుసార్లు ప్రపంచ హోవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ జార్జ్ ఫొరెమాన్ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జార్జ్ మరణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత జార్జ్.. క్రైస్తవ మత బోధకుడిగా సేవలందించారు. అమెరికాలోని టెక్సాస్‌లో 1949లో జన్మించిన జార్జ్… యవ్వనంలో బాక్సింగ్ మీద దృష్టి సారించాడు. తొలి టైటిల్ వేటలో మహ్మద్ అలీ చేతిలో కంగుతిన్న జార్జ్ 19ఏళ్లకు తన శక్తిని ప్రపంచానికి చాటాడు. తన పంచ్ వపవర్ చూపిస్తూ.. 1968లో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుపొందాడు. కెరియర్‌లో 76 మ్యాచుల్లో జార్జ్ విజేతగా నిలవగా.. వాటిలో ఏకంగా 68సార్లు నాకౌట్ చేయడం విశేషం. 28 ఏళ్లకే ఆటకు అల్విదా పలికి అందర్ని ఆశ్చర్యపరిచిన ఈ స్టార్ బాక్సర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
