ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జాతీయస్థాయి త్వైకాండో పోటీలకు విజయనగరానికి చెందిన వి. హిమశ్రీ ఎంపికైంది. ఈ సందర్భంగా హిమశ్రీని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా త్వైకాండో చీఫ్ కోచ్ డి.వి.చారి మాట్లాడుతూ.. నగరానికి చెందిన వి.హిమశ్రీ త్వైకాండో పోటీల్లో తన ప్రతిభను కనబరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య పాండిచ్చేరిలో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ పోటీల్లో కాంస్య పథకాన్ని సాధించి, త్వరలో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికైందన్నారు. ఈనెల 9, 10, 11 తేదీలలో ఒడిశాలోని కటక్‌లో జరగనున్న ఆల్ ఇండియా ఫైనల్ జాతీయ పోటీలలో తన సత్తాను మరోసారి నిరూపించనున్నదని అన్నారు. గతంలో మూడుసార్లు జాతీయ పోటీలలో హిమశ్రీ పథకాలను సాధించిందన్నారు. హిమ శ్రీ నీ అభినందించిన వారిలో వైసిపి నాయకులు ఉన్నారు.
