న్యూఢిల్లీ : వంద గ్రాముల బరువు అధికంగా ఉన్నారంటూ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేయడంతో వినేశ్ ఫొగట్ ఫైనల్స్ ఆడలేకపోయారు. దీంతో భారత క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాధ వ్యక్తం చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే వినేశ్ ఫోగట్ రెండు కేజీల బరువు ఎలా పెరిగారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆమె బరువు పెరిగే అవకాశం అస్సలు లేదని.. ఒకవేళ బరువు పెరిగిందంటే వినేశ్ తీసుకున్న ఆహారం కారణంగానే అయి ఉంటుందంటున్నారు. ఈ సమయంలో వినేశ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆమె కోచ్ పర్యవేక్షించాల్సిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కోచ్ పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గంటల వ్యవధిలోనే వినేశ్ 2 కేజీల బరువు ఎలా పెరిగారు..?
