ఒలింపిక్స్‌ క్రికెట్‌ వేదికను ప్రకటించిన ఐసిసి

Apr 16,2025 22:46 #Cricket, #Olympics Cricket, #Sports

2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ వేదికలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) బుధవారం ప్రకటించింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలో క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసిసి తెలిపింది. సుమారు 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలు, పురుఫుల విభాగాల్లో ఆరేసి జట్లు టి20 ఫార్మాట్‌లో పోటీపడనున్నాయి. లాస్‌ ఏంజిల్స్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొమోనా సిటీలోని ఫెయిర్‌గ్రౌండ్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ కోసం క్రికెట్‌ వేదికను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఐసిసి చైర్మెన్‌ జే షా తెలిపారు.

➡️