- ఛాంపియన్స్, డబ్ల్యుటిసి టైటిళ్లపైనే ప్రధాన చర్చ?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) సమావేశం 29న జరగనుంది. ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యుటిసి టైటిళ్లపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారతజట్టు అంగీకరించడం లేదు. హైబ్రీడ్ మోడల్‌కు బిసిసిఐ ప్రతిపాదిస్తుండగా.. అందుకు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు ససేమిరా అంటోంది. ఐసిసి టోర్నమెంట్‌లలో ఆడేందుకు 2016, 2023లలో పాకిస్తాన్ జట్టు రెండుసార్లు భారత పర్యటనకు రాగా.. 2006నుంచి భారతజట్టు పాకిస్తాన్‌లో ఐసిసి టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు వెళ్లడం లేదు. ఇదే విషయాన్ని పాక్ బోర్డు ఐసిసి సమావేశంలో ప్రధాన ఎజెండాగా తీసుకురావాలని చూస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌తోపాటు 2025 ఐసిసి టోర్నమెంట్‌లపై ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఐసిసి టోర్నమెంట్‌ల షెడ్యూల్‌ను 100ముందు ప్రకటించాల్సి ఉండగా.. దీంతో అత్యవసరంగా ఐసిసి సమావేశమైంది. ఈ వారంలో ఐసిసి ఛైర్మన్‌గా జే షా బాధ్యతలు స్వీకరించనున్న దృష్ట్యా మిగిలిన అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో ప్రస్తుత సభ్యులతో సమావేశంలో వేయాలని ఐసిసి భావించినట్లు తెలిసింది.