శ్రేయస్‌ అయ్యర్‌కు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మార్చి నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. మార్చి నెలకు గాను ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు కోసం అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్‌ డఫీ, రచిన్‌ రవీంద్రలు కూడా పోటీ పడ్డారు. వారిద్దరినీ అధిగమించి అయ్యర్‌ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈ సందర్భంగా తనకు దక్కిన ఈ గౌరవం పట్ల అయ్యర్‌ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ మెగా ఈవెంట్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అయ్యర్‌ 243 రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.

➡️