- ఒక్క బంతి పడకుండానే ఆట రద్దు
కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఉదయం నుంచి వర్షం పడటంతో ఆటగాళ్లు మైదానంలో దిగేందుకు వీలుపడలేదు. వర్షం కారణంగా మైదానమంతా చిత్తడిగా మారింది. దీంతో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు టీ విరామం తర్వాత ప్రకటించారు. తొలి రోజు కేవలం 35ఓవర్ల ఆట మాత్రమే కొనసాగగా.. వర్షం కారణంగా సగానికిపైగా ఓవర్లు తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ సమయానికి బంగ్లాదేశ్ జట్టు 3వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో మొమినల్ హక్(40), ముష్ఫికర్ రహీమ్(6) ఉన్నారు. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.