IND vs NZ 3rd Test – భారత్‌ ఫస్ట్‌ బౌలింగ్‌

ముంబయి : న్యూజిలాండ్‌ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటమిని చవిచూసింది. ఇక ముంబయి వేదికగా శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా విజయం సాధించాలనే లక్ష్యంతో టీమిండియా మూడో టెస్టుకు సన్నద్ధమయ్యింది. కివీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి, ఆ తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందనే ఉద్దేశంతో ఆతిథ్య జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ముందుకుకొనసాగాలంటే ఈ విజయం టీమిండియాకు అత్యవసరం. మూడో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఆడటం లేదు. వర్క్‌ లోడ్‌ కారణంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. దీంతో పేస్‌ విభాగాన్ని సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ నడిపిస్తారు. పంత్‌, జడ్డూను కొనసాగించింది. మొదట వీరికి కూడా విశ్రాంతినిచ్చి.. అక్షర్‌, ధ్రువ్‌ జురెల్‌ను ఆడిస్తారని భావించారు. న్యూజిలాండ్‌ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్‌ స్థానంలో ఐష్‌ సోధికి అవకాశం దక్కింది.

తుది జట్లు …
భారత్‌ : యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆకాశ్‌ దీప్‌, సిరాజ్‌

న్యూజిలాండ్‌ : టామ్‌ లేథమ్‌ (కెప్టెన్‌), డేవన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, ఐష్‌ సోధి, మ్యాట్‌ హెన్రీ, అజాజ్‌ పటేల్‌, విలియమ్‌ ఒరోర్కీ

➡️