IND vs SA : దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన..

టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును గురువారం ప్రకటించింది. ఎయిడెన్‌ మార్క్రమ్‌ జట్టు కెప్టెన్‌..  ఈ సిరీస్‌లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. మార్కో జన్సెన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, కేశవ్‌ మహారాజ్‌ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ అండీల్‌ సైమ్‌లేన్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, డోనోవన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్‌, మార్కో జన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, పాట్రిక్‌ క్రూగర్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, అండీల్‌ సైమ్‌లేన్‌, లూథో సిపామ్లా, రిస్టన్‌ స్టబ్స్‌

భారత జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, రమన్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, అభిషేక్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్ కుమార్‌ వైశాఖ్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌, యశ్‌ దయాల్‌, ఆవేశ్‌ ఖాన్‌

షెడ్యూల్‌..
తొలి టీ20- నవంబర్‌ 8- డర్బన్‌
రెండో టీ20- నవంబర్‌ 10- గ్వెబెర్హా
మూడో టీ20- నవంబర్‌ 13- సెంచూరియన్‌
నాలుగో టీ20- నవంబర్‌ 15- జొహనెస్‌బర్గ్‌

➡️