చెలరేగిన పాక్‌ బౌలర్లు.. భారత్‌ 119 అలౌట్‌..

Jun 9,2024 23:21 #Cricket, #Sports, #T20 world cup
  • పాక్‌ లక్ష్యం 120

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో హై ఓల్టేజీ మ్యాచ్‌ భారత్‌ 119 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దీంతో పాక్‌ ముందు 120 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచింది. కాగా ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఒపెనర్లుగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. రోహిత్‌ శర్మ తొలి బంతికే రెండు పరుగుల చేసి భారత స్కోర్‌ బోర్డును ప్రారంభించాడు. ఆ తర్వాత సిక్సుతో బాదాడు.. తొలి ఓవర్‌ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్‌ కొద్ది సేపు నిలిచిపోయింది. వర్షం ఆగడంతో మళ్లీ మ్యాచ్‌ ప్రారంభం అయింది. రెండో ఓవర్‌ను విరాట్‌ కోహ్లీ ప్రారంభించాడు. తొలి బంతికే ఫోర్‌ కొట్టిన కోహ్లీ మరో షాట్‌ ఆడబోయి.. క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన రోహిత్‌ బౌండరీలైన్‌ వద్ద క్యాచ్‌ రూపంలో ఔట్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్‌ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రిషబ్‌ పంత్‌ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో నషీమ్‌షా వేసిన 8వ ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరువాత వరుస పెట్టి సూర్య కుమార్‌ (5), శివమ్‌ దూబే (3), జడేజా(0), 42 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా(0) పెవిలియన్‌కు చేరాడు. చివరి వికెట్‌గా 9 పరుగులు చేసిన అర్షదీప్‌సింగ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ 3 , నసీమ్‌ షా 3, మహ్మద్‌ అమీర్‌ 2, షాహీన్‌ అఫ్రిది 1 వికెట్‌ తీశారు.

➡️