IND vs ENG: అభిషేక్‌ సెంచరీ

Feb 2,2025 23:31
  •  చివరి టి20లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం
  •  షమికి మూడు వికెట్లు
  •  సిరీస్‌ 4-1తో కైవసం

ముంబయి: వాంఖడే స్టేడియంలో జరిగిన ఐదో, చివరి టి20లో అభిషేక్‌ సెంచరీ ధనా ధన్‌ సెంచరీతో మెరిసాడు. దూబే(30), తిలక్‌ వర్మ(24) కూడా బ్యాటింగ్‌లో రాణించడంతో టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సాల్ట్‌(55) అర్ధసెంచరీతో మెరిసినా.. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు సమిష్టి రాణించడం ఇంగ్లండ్‌ 10.3ఓవర్లలో 97పరుగులకే కుప్పకూలింది. పేసర్‌ మహ్మద్‌ షమి(3/25)కి తోడు వరుణ్‌ చక్రవర్తి, దూబే, అభిషేక్‌ శర్మ రెండేసి వికెట్లతో రాణించారు. దీంతో టీమిండియా ఐదు టి20ల సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఓపెనర్లు సంజూ శాంసన్‌(16) నిరాశపరిచినా.. అభిషేక్‌ శర్మ(135) సెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్‌ ఏడు బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో 16 పరుగులు మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో జోఫ్రా అర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ, సారధి సూర్య కుమార్‌ యాదవ్‌ వెంటవెంటనే ఔటయినా.. అభిషేక్‌ శర్మ క్రీజ్‌లో పాతుకుపోయాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. అభిషేక్‌ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తం 54 బంతుల్లో 135 పరుగులు చేసి అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శివం దూబే 13బంతుల్లో 30 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ మూడు, మార్క్‌ వుడ్‌ రెండు, జోఫ్రా ఆర్చర్‌, జామీ ఓవర్‌టన్‌, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సాల్ట్‌(55), బేథెల్‌(10) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ అభిషేక్‌ శర్మకు దక్కింది. గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

స్కోర్‌బోర్డు…
ఇండియా ఇన్నింగ్స్‌: సంజు (సి)ఆర్చర్‌ (బి)వుడ్‌ 16, అభిషేక్‌ శర్మ (సి)ఆర్చర్‌ (బి)రషీద్‌ 135, తిలక్‌ వర్మ (సి)సాల్ట్‌ (బి)కర్సె 24, సూర్యకుమార్‌ (సి)సాల్ట్‌ (బి)కర్సె 2, దూబే (సి)రషీద్‌ (బి)కర్సె 30, హార్దిక్‌ (సి)లివింగ్‌స్టోన్‌ (బి)వుడ్‌ 9, రింకు సింగ్‌ (ఎల్‌బి)ఆర్చర్‌ 9, అక్షర్‌ (రనౌట్‌)లివింగ్‌స్టోన్‌/సాల్ట్‌ 15, షమీ (నాటౌట్‌) 0, బిష్ణోరు (సి)కర్సె (బి)ఓవర్టన్‌ 0, అదనం 7. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 247పరుగులు.

వికెట్ల పతనం: 1/21, 2/136, 3/145, 4/182, 5/193, 6/202, 7/237, 8/247, 9/247

బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-55-1, వుడ్‌ 4-0-32-2, ఓవర్టన్‌ 3-0-46-1, లివింగ్‌స్టోన్‌ 2-0-29-0, రషీద్‌ 3-0-41-1, కర్సె 4-0-38-3.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)ధృవ్‌ జురెల్‌ (బి)దూబే 55, డకెట్‌ (సి)అభిషేక్‌ (బి)షమీ 0, బట్లర్‌ (సి)తిలక్‌ వర్మ (బి)వరుణ్‌ చక్రవర్తి 7, బ్రూక్‌ (సి)వరణ్‌ చక్రవర్తి (బి)బిష్ణోరు 2, లివింగ్‌స్టోన్‌ (సి)రింకు సింగ్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 9, బేథెల్‌ (బి)దూబే 10, కర్సె (సి)వరుణ్‌ చక్రవర్తి (బి)అభిషేక్‌ శర్మ 3, ఓవర్టన్‌ (సి)సూర్యకుమార్‌ (బి)అభిషేక్‌ శర్మ 1, ఆర్చర్‌ (నాటౌట్‌) 1, రషీద్‌ (సి)ధృవ్‌ జురెల్‌ (బి)షమీ 6, వుడ్‌ (సి)ధృవ్‌ జురెల్‌ (బి)షమీ 0, అదనం 3. (10.3ఓవర్లలో ఆలౌట్‌) 97పరుగులు.

వికెట్ల పతనం: 1/23, 2/48, 3/59, 4/68, 5/82, 6/87, 7/90, 8/90, 9/97, 10/97

బౌలింగ్‌: షమీ 2.3-0-25-3, హార్దిక్‌ 2-0-23-0, వరుణ్‌ చక్రవర్తి 2-0-25-2, బిష్ణోరు 1-0-9-1, దూబే 2-0-11-2, అభిషేక్‌ శర్మ 1-0-3-2.

➡️