శాఫ్‌ అండర్‌-17 ఫుట్‌బాల్‌ విజేత భారత్‌

థింపు(బూటాన్‌): శాఫ్‌ అండర్‌-17 ఫుట్‌బాల్‌ టైటిల్‌ను భారత యువజట్టు చేజిక్కించుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 2-0గోల్స్‌తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఛాంగ్లిమితాంగ్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలి అర్ధభాగంలో ఇరుజట్లు గోల్స్‌ చేఉయడంలో విఫలమయ్యాయి. రెండో అర్ధభాగం 58వ ని.లో మహ్మద్‌ కైఫ్‌ అద్భుత హెడ్డర్‌ ద్వారా గోల్‌ కొట్టి భారత్‌ను 1-0 ఆధిక్యతలో నిలిపాడు. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనుకున్న దశలో 90+5వ ని.లో మహ్మద్‌ అర్బాష్‌ మరో గోల్‌ చేశాడు. బంతి ఎక్కువ భాగం భారత ఆటగాళ్ల చేతుల్లో ఉండగా.. రెండో అర్ధబాగంలో భారత్‌కు కార్నర్‌ కిక్‌ నుంచి తొలి గోల్‌ చేసే అవకాశం లభించింది.

➡️