India Tour of Bangladesh.. 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌

ఆగష్టులో టీమిండియా జట్టు బంగ్లాదేశ్‌ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ లు ఆడనుంది. ఈ పర్యటన షెడ్యూల్‌ ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నేడు విడుదల చేసింది. ఈ పర్యటనుకు ముందు టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. జూన్‌ 20న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌ జులై 4న ముగియనుంది. ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.

టీమిండియా-బంగ్లాదేశ్‌ తో వన్డే సిరీస్‌
తొలి వన్డే- ఆగస్టు 17 (మిర్పూర్‌)
రెండో వన్డే- ఆగస్టు 20 (మిర్పూర్‌)
మూడో వన్డే- ఆగస్టు 23 (చట్టోగ్రామ్‌)

టీమిండియా-బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌
తొలి టీ20- ఆగస్టు 26 (చట్టోగ్రామ్‌)
రెండో టీ20- ఆగస్టు 29 (మిర్పూర్‌)
మూడో టీ20- ఆగస్టు 31 (మిర్పూర్‌)

➡️