IND vs ENG: టీమిండియా ఘన విజయం

Mar 9,2024 12:18 #Day 3, #India-England, #test match

ధర్మశాల వేదికగా  ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్‌ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

  • రూట్‌ 50.. ఇంగ్లాండ్‌ 161/8

ఇంగ్లాండ్‌ ఆటగాడు జో రూట్‌ ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం నమోదు చేశాడు. సహాచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్న రూట్‌ పట్టుదలతో బ్యాటింగ్‌ కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం రూట్‌ 93 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. మరోవైపు బషీర్‌ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ ఇంకా 98 పరుగులు వెనుకబడి ఉంది.

  • బూమ్రాకు రెండు వికెట్లు.. 114 పరుగుల దూరంలో ఇంగ్లాండ్‌

వరుసగా వికెట్లు కోల్పోతూ.. ఇంగ్లాండ్‌ కష్టాలో పడింది. బూమ్రా వేసిన 34 ఓవర్‌లో 28 పరుగులు చేసిన టామ్‌ హార్ల్టే ఎల్‌బీగా వెనుదిరిగాడు. మార్క్‌ వుడ్‌ క్రీజులోకి వచ్చిన వేంటనే పరుగులేమీ చేయ్యకుండా ఎల్‌బీగా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్‌ ఇంకా 114 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో రూట్‌ 44 పరుగుతో ఓంటరి పోరాటం చేస్తున్నాడు. భారత్‌ విజయం సాధించాలంటే ఇంకా రెండు వికెట్లు తీయాల్సి ఉంది.

  • ఆశ్విన్‌కు ఐదో వికెట్‌.. ఇంగ్లాండ్‌ 113/6

లంచ్‌ బ్రేక్‌ తరువాత అశ్విన్‌ బౌలింగ్‌లో బెన్‌ ఫోక్స్‌(8) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆశ్విన్‌కు ఐదో వికెట్‌ దక్కింది. టామ్‌ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్‌ 36 పరుగులపై ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌ స్కోరు: 113/6గా ఉంది.

  • లంచ్‌ బ్రేక్‌.. ఇంగ్లాండ్‌ 103/5

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లాండ్‌ 103 పరుగులకే 5 వికెట్‌ కోల్పోయి కష్టలో పడింది. ఆశ్విన్‌కు 4 వికెట్లు దక్కగా, కుల్‌దీప్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో బెయిర్‌స్టో (39) పర్వలేదనిపించగా.. బెన్‌ డకెట్‌ (2), క్రాలే (1), ఒలీ పోప్‌ (19), బెన్‌ స్టోక్స్‌ (2) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. రూత్‌ 32 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ 156 పరుగులు వెనుబడి ఉంది.

  • బెన్‌స్టోక్స్‌ ఔట్‌

ఆశ్విన్‌కు మరో వికెట్‌ దక్కింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రెండు పరుగులు మాత్రమే చేసి ఆశ్విన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మరో వైపు రూట్‌ వికెట్‌ ఇవ్వకుండా ఆడుతున్నాడు. రూట్‌ 52 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

  • ఈసారి కుల్‌దీప్‌కు వికెట్‌.. బెయిర్‌స్టో ఎల్‌బీ

రెండో ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ తొలి వికెట్‌ తీసుకున్నాడు. 31 బంతుల్లో 39 పరుగులు చేసిన బెయిర్‌స్టో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి బెన్‌ స్టోక్స్‌ వచ్చాడు. రూట్‌ 32 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.

  • ఒలీ పోప్‌ ఔట్‌.. అశ్విన్‌కు మూడో వికెట్‌

ఒలీ పోప్‌ కూడా అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఒలీ పోప్‌ 23 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రాజులోకి జానీ బెయిర్‌స్టో వచ్చాడు. ఇంగ్లాండ్‌ స్కోరు ప్రస్తుతం 36/3గా ఉంది.

  • క్రాలే ఔట్‌

16 బంతుల్లో 1 పరుగు చేసిన క్రాలే అశ్విన్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు.పోప్‌ 17 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. జో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్కోరు: 23/2గా ఉంది.

  • ఆశ్విన్‌కు తొలి వికెట్‌

రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన కాసేపటికే ఆశ్విన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ పెవిలియన్‌కు చేరాడు. బెన్‌ 5 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులోకి పోప్‌ వచ్చాడు.

  • టీమిండియా అలౌట్‌.. 259 పరుగుల అధిక్యం

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ శనివారం ఆట మొదలుపెట్టిన కాసేపటికే కుల్దీప్‌ యాదవ్‌(30) షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా(20) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా అలౌట్‌ అయ్యింది. ప్రస్తుతం భారత్‌ ఇంగ్లండ్‌ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్‌ బషీర్‌ ఐదు వికెట్లు, టామ్‌ హార్లే రెండు వికెట్లు, పేసర్లు జేమ్స్‌ ఆండర్సన్‌ రెండు, కెప్టెన్‌ స్టోక్స్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

➡️