టి20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా…

Mar 20,2025 00:31 #Abhishek, #Cricket, #Sports, #t20 rankings
  • టాప్‌-5లో ముగ్గురికి చోటు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. యువ సంచలన బ్యాట్స్‌మెన్‌ అభిషేక్‌ శర్మ బ్యాట్స్‌మెన్‌ ర్యాకింగ్స్‌లో రెండోస్థానాన్ని నిలబెట్టుకోగా.. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన తాజా బ్యాటర్ల జాబితాలో తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. 856 రేటింగ్‌ పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఫిల్‌ సాల్ట్‌ (ఇంగ్లాండ్‌) 815 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. అభిషేక్‌ శర్మ 829, తిలక్‌ వర్మ 804, సూర్యకుమార్‌ ఖాతాల్లో 739 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. బౌలర్ల ర్యాకింగ్స్‌లో వెస్టిండీస్‌కు చెందిన అకిల్‌ హుస్సేన్‌ 707 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వరుణ్‌ చక్రవర్తి 706 పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ 705 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. వానిందు హసరంగా (శ్రీలంక) 700 పాయింట్లతో నాలుగు, ఆడమ్‌ జంపా (ఆస్ట్రేలియా) 694 పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా ప్లేయర్‌ రవి బిష్ణోరు 674 పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్నాడు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో మ్యాచులేమీ ఆడకపోవడంతో స్థానాలు మారలేదు.

➡️