భారత బౌలర్‌ రికార్డు.. 4 బంతుల్లో 4 వికెట్లు..

Feb 13,2024 11:13 #Cricket, #Ranji Trophy, #Sports

భారత బౌలర్‌, మధ్యప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ కుల్వంత్‌ కేజ్రోలియా రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా హౌల్కర్‌ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్‌ ఇన్నింగ్స్‌ 95వ ఓవర్‌లో కుల్వంత్‌ ఈ ఘనతను అందుకున్నాడు. 95వ ఓవర్‌లోని 2, 3, 4, 5 బంతులకు కుల్వంత్‌ కేజ్రోలియా వికెట్స్‌ పడగొట్టాడు. మధ్యప్రదేశ్‌ బ్యాటర్లు షెష్వాత్‌ రావత్‌, మహేష్‌ పీతియా, భార్గవ్‌ భట్‌, ఆకాశ్‌ సింగ్‌లను ఔట్‌ చేశాడు. ఇంతకుముందు ఢిల్లీ బౌలర్‌ శంకర్‌ సైనీ (1988), జమ్మూ కశ్మీర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ముదాసిర్‌ (2018)లు రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. మధ్యప్రదేశ్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన మూడో బౌలర్‌గా.. రంజీల్లో హ్యాట్రిక్‌ సాధించిన 80వ క్రికెటర్‌గా కుల్వంత్‌ రికార్డుల్లోకెక్కాడు.

➡️