అంతర్‌ జిల్లాల రెజ్లింగ్‌ పోటీలు ప్రారంభం

  • 700 మంది క్రీడాకారులు, కోచ్‌, మేనేజర్లు హాజరు

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌ : విజయవాడ రూరల్‌ మండలం నున్నలో మూడు రోజులపాటు జరిగే స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (అండర్‌ 14, 19 బాల బాలికల ఫ్రీ స్టైల్‌, అండర్‌ 17, 19 బాలుర గ్రీకో రోమన్‌) గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జిఎఫ్‌ఐ) ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాసరావుతో కలిసి విజయవాడ రూరల్‌ మండల జడ్‌పిటిసి సభ్యులు కె సువర్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు 13 ఉమ్మడి జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు సాంకేతిక న్యాయ నిర్ణేతలు హాజరైనట్లు తెలిపారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపిస్తామని తెలిపారు.

➡️