ఆదిత్య విద్యార్థికి చదరంగంలో అంతర్జాతీయ టైటిల్‌

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : స్థానిక ఆదిత్య స్కూల్లో మూడో తరగతి చదువుతున్న అన్నెపు శశాంక్‌ అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ఫిడే నుండి ఏరేవా క్యాండిడేట్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించినట్లు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె.వాసుదేవ శనివారం ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిగూడెం నుండి అంతర్జాతీయ ఫిడే క్లాసికల్‌ రేటింగ్‌ విభాగంలో 1470 పాయింట్లు ఈ టైటిల్‌ సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు కావడం విశేషమని ప్రిన్సిపల్‌ తెలిపారు. ఇటీవల విజయనగరం, కోనసీమ లో జరిగిన చెస్‌ చాంపియన్‌ షిప్‌ అండర్‌-7 కేటగిరిలో రాష్ట్రస్ధాయిలో ప్రథమ స్థానం సంపాదించాడని తెలియచేశారు. ఈ సందర్భంగా అన్నెపు శశాంక్‌ ను ఆదిత్య తాడేపల్లిగూడెం డైరెక్టర్‌ కె. శ్రీమవాసరెడ్డి , జిల్లా డైరెక్టర్‌ రాఘవరెడ్డి , స్కూల్స్‌ డైరెక్టర్‌ శఅతిరెడ్డి రెడ్డి , చైర్మన్‌ శేషారెడ్డి అభినందించారు.

➡️