IPL 2024 : రిషబ్‌ పంత్‌కు భారీ జరిమానా

విశాఖ : ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు ఐపిఎల్‌ అధికారులు రూ.12 లక్షల జరిమానాను విధించారు. ఆదివారం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రిషబ్‌ పంత్‌కు జరిమానా పడింది. విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపిఎల్‌ ప్రకటనలో పేర్కొంది.

ఐపిఎల్‌ నిబంధనల ప్రకారం … ప్రతి జట్టు 20 ఓవర్లను 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకున్నందుకు ఒక ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ నుంచి కత్తిరించారు. అలాగే, ఈ తప్పు చేసిన జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించారు. అదే తప్పును 2వ సారి పునరావృతం చేస్తే కెప్టెన్‌ కి రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. ప్లేయింగ్‌ లోని 10 మంది ఆటగాళ్లపై రూ.6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడుతుంది. మూడోసారి ఇదే తప్పు పునరావృతమైతే జట్టు కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తారు. ఇది కాకుండా మూడుసార్లు ఇలా చేస్తే కెప్టెన్‌ను ఒక మ్యాచ్‌లో నిషేధిస్తారు. ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోని 10 మంది ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 10 శాతం నుంచి 50 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు రిషబ్‌ పంత్‌ మొదటిసారి తప్పు చేశారు. ఈ కారణంగా రిషబ్‌కు రూ.12 లక్షలు జరిమానా మాత్రమే విధించారు. అదే తప్పు రెండవ మ్యాచ్‌లలో 2 సార్లు పునరావృతమైతే, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెప్టెన్‌ ఒక మ్యాచ్‌ నిషేధించబడతాడు. కాబట్టి రిషబ్‌ పంత్‌ తరువాతి మ్యాచ్‌లలో స్లో ఓవర్‌ రేట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

➡️