- ఈ సీజన్ ఐపిఎల్‌కు దూరం
ఛండీగడ్: పంజాబ్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ ఐపిఎల్‌కు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ మోకాలికి గాయమైంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి ఫెర్గూసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హౌప్స్ కూడా ధృవీకరించాడు. ఫెర్గూసన్ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే అతడి స్ధానంలో జేవియర్ బార్ట్‌లెట్ లేదా అజ్మతుల్లా ఒమర్జారు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పంజాబ్ మూడింట గెలుపొందింది.