IPL: సన్‌రైజర్స్‌కు వర్షం దెబ్బ

May 5,2025 22:56 #Cricket, #Delhi Capitals, #IPL 2025

 హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌కు అడ్డంకి
 ఇరుజట్లకు చెరో పాయింట్‌
 ఢిల్లీ క్యాపిటల్స్‌ 133/7

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఢిల్లీని కట్టడి చేసి మరో విజయానికి చేరువైందనుకున్న దశలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడం సులువే అనుకున్న దశలో ఉప్పల్‌లో భారీ వర్షం ముంచెత్తింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసిందో లేదో చినుకులు మొదలయ్యాయి. ఆ చినుకులు కాస్తా కొద్దిసేపటికే భారీ వర్షంగా మారింది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు.

నిప్పులు చెరిగిన కమిన్స్‌
సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్లు రెచ్చిపోయారు. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నడ్డి విరిచారు. తొలుత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌(3/19) మూడు వికెట్లతో టాప్‌ ఆర్డర్‌ నడ్డి విరగ్గొట్టగా.. ఉనాద్కట్‌(1/13) ఫామ్‌లో ఉన్న డేంజరస్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(10)ను ఔట్‌ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లో నెట్టాడు. దీంతో ఢిల్లీ 62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ట్రిస్టన్‌ స్టబ్స్‌(41 నాటౌట్‌) ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ అశుతోష్‌ శర్మ(41)లు ఢిల్లీని ఆదుకున్నారు. డెత్‌ ఓవర్లలో ఈ జోడీ హైదరాబాద్‌ బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలు రాబట్టి స్కోర్‌బోర్డును 100 పరుగులు దాటించింది. ఏడో వికెట్‌కు వీరు 66 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. మలింగ వేసిన 20వ ఓవర్ల్‌ స్టబ్స్‌ ఫోర్‌ బాది ఢిల్లీ స్కోర్‌ను 133 పరుగులకు చేర్చాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో కమిన్స్‌కు మూడు, ఉనాద్కట్‌, హర్షల్‌ పటేల్‌, ఈషన్‌ మలింగకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: కరణ్‌ నాయర్‌ (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)కమిన్స్‌ 0, డుప్లెసిస్‌ (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)కమిన్స్‌ 3, అభిషేక్‌ పోరెల్‌ (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)కమిన్స్‌ 8, కెఎల్‌ రాహుల్‌ (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)ఉనాద్కట్‌ 10, అక్షర్‌ పటేల్‌ (సి)కమిన్స్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 6, స్టబ్స్‌ (నాటౌట్‌) 41, విప్‌రాజ్‌ నిగమ్‌ (రనౌట్‌) అంకిత్‌ వర్మ (బి)అన్సారి 18, అశుతోష్‌ శర్మ (సి)అభినవ్‌ మనోహర్‌ (బి)ఇషాన్‌ మలింగ 41, స్టార్క్‌ (నాటౌట్‌) 1, అదనం 5. (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 133పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/6, 3/15, 4/26, 5/29, 6/62, 7/128 బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-19-3, ఉననాద్కట్‌ 4-0-13-1, హర్షల్‌ పటేల్‌ 4-0-36-1, ఇషన్‌ 4-0-28-1, జీషన్‌ అన్సారి 3-0-30-0, అభిషేక్‌ వర్మ 1-0-5-0.

➡️