- ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సిపై 2-1గోల్స్‌తో గెలుపు
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) 2025 సీజన్ టైటిల్‌ను మోహన్ బగాన్ జట్టు గెల్చుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సిపై 2-1గోల్స్‌తో విజయం సాధించింది. దీంతో లీగ్ చరిత్రలో తొలిసారి ఐఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేసి టైటిల్ కొట్టిన తొలి జట్టుగా మోహన్ బగాన్ జట్టు నిలిచింది. తొలి రెండు అర్ధభాగాలు ముగిసేసరికి ఇరుజట్లు 1-1గోల్స్‌తో సమంగా నిలిచాయి. 49వ ని.లో మోహన్ బగాన్ ఆటగాడు ఆల్బెర్టో రోడ్రిగ్స్ సెల్ఫ్ గోల్ చేయడంలో బెంగళూరు జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. 72వ ని.లో మోహన్ బగాన్ ఆటగాడు జాసన్ కమ్మింగ్స్ గోల్ కొట్టాడు. అదనపు సమయం 96వ ని.లో జామీ మెక్‌లారెన్ గోల్ కొట్టి మోహన్ బగాన్‌ను విజేతగా నిలిపాడు. గతంలో ఎటికె మోహన్ బగాన్ పేరుతో ఆడిన ఈ జట్టు మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిందిి. ఈసారి మోహన్ బగాన్ పేరుతో నేరుగా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విజేతగా నిలిచింది.