హైదరాబాద్: పారిస్ పారాలింపిక్స్‌లో దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సష్టించింది. కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రభుత్వం తరఫున రూ.కోటి, కోచ్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతిగా ప్రకటించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని పేర్కొన్నారు.
