India Open Badminton : క్వార్టర్స్‌కు కిరణ్‌ జార్జి

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి కిరన్‌ జార్జి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో కిరణ్‌ జార్జి 22-20, 21-13తో అలెక్స్‌(ఫ్రాన్స్‌)ను వరుససెట్లలో చిత్తుచేశాడు. మరో పోటీలో 6వ సీడ్‌ నరోకా(జపాన్‌) 17-21, 15-21తో అనూహ్యంగా అన్‌సీడెడ్‌, సింగపూర్‌కు చెందిన యో-లెV్‌ా చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో ప్రి క్వార్టర్‌ఫైనల్లో 3వ సీడ్‌, డెన్మార్క్‌ఉ చెందిన విక్టర్‌ అక్సెల్సన్‌ 21-11, 21-14తో జాన్సెన్‌(సింగపూర్‌)ను ఓడించాడు. ఇక పురుషుల డబుల్స్‌లో 7వ సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జంట 20-22, 21-14, 21-16తో జపాన్‌ జంటను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు.

సింధు ముందుకు..

మహిళల సింగిల్స్‌లో పివి సింధు క్వార్టర్స్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రి క్వార్టర్స్‌లో సింధు 21-15, 21-13తో మనామీ సుజు(జపాన్‌)ను ఓడించింది.

పురుషులు..
కిరణ్‌ జార్జి × హంగ్‌యాన్‌
ఛౌ టిన్‌ చెస్‌ × ఛో-యు-లీ
కెన్‌-యు-హో × అక్సెల్సన్‌
ఛున్‌-హి-లిన్‌ × జొనాథన్‌ క్రిస్టీ

మహిళలు..
సే-అన్‌ × జియా-మిన్‌-యో
పివి సింధు × మరిస్కా
యు-హన్‌ × ఫంగ్‌-జియా
మియాజాకి × జి-హి-వాంగ్‌

➡️