చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం.. భారత్‌ జట్టు ప్రకటన..

Feb 10,2024 11:20 #Cricket, #Sports, #test match, #Virat Kohli

ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. కొత్తగా ఆకాశ్‌ దీప్‌ టెస్టుల్లోకి ఎంపికయ్యాడు. రజత్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గాయం కారణంగా శ్రేయస్‌ను ఎంపిక చేయలేదు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌ 1-1తో సమంగా నిలిచాయి.జట్టు ఇదే: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభమన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌

➡️