శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284ఆలౌట్
దినుషా సెంచరీ, డిక్వెల్లా అర్ధసెంచరీ
టీమిండియాకు 178 పరుగుల ఆధిక్యత
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ ఆధిక్యత లభించింది. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 284పరుగులకు ఆలౌట్ చేయడంతో భారతజట్టుకు 178 పరుగుల ఆధిక్యత లభించింది. శ్రీలంక బ్యాటర్లు సోనల్ దినుషా సెంచరీకి తోడు డిక్వెల్లా అర్ధసెంచరీలతో రాణించగా.. భారత అరంగేట్ర బౌలర్ మానవ్ సుతార్ నాలుగు వికెట్లకు తోడు జడేజా మూడు వికెట్లతో రాణించారు. దినుషా సెంచరీతో శ్రీలంక ఫాలోఆన్ గడం తప్పించుకుంది. స్పిన్‌ను అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు రాణించారు. ఓవర్ నైట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 460 పరుగులతో సోమవారం మూడోరోజు ఆటను కొనసాగించిన భారతజట్టు మరో 2పరుగులు జతచేసి ప్రసిధ్ కృష్ణ(2)వికెట్ కోల్పోయింది. ఆ వికెట్‌ను అసితా ఫెర్నాండో పడగొట్టాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 462పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక బౌలర్లు ప్రభాత్ జయసూరియకు నాలుగు, నువాంతకు మూడు, పెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో(0) డకౌట్ కాగా.. ఛండీమాల్(4), కమిందు(14), ఉదారా(27), ధనుంజయ(21) ఇలా స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. దీంతో శ్రీలంక జట్టు 90పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో సెషన్‌లో దినుషా, డిక్వెల్లా కీలక ఇన్నింగ్స్ ఆడారు. టెస్టుల్లో దినుషా తొలి సెంచరీ నమోదు చేశాడు. దినుషా 168 బంతుల్లో 4 బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో సెంచరీ కొట్టాడు. వికెట్ కీపర్ డిక్వెల్లా 115 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. దినుషా, డిక్వెల్లా 5వ వికెట్‌కు 146 పరుగులు జోడించారు. డిక్వెల్లా ఔటయ్యాక లంక వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దినుష(100) కూడా సరిగ్గా సెంచరీ చేసి ఔటయ్యాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా మూడు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. శ్రీలంక ఆలౌటైన తర్వాత వర్షం కురవడంతో మూడో రోజు ఆట ముగిసింది. దీంతో మంగళవారం నాల్గోరోజు ఆట పదిహేను నిమిషాల ముందే ఆరంభం కానుంది.
స్కోర్‌బోర్డు...
ఇండియా తొలి ఇన్నింగ్స్: 262పరుగులు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఫెర్నాండో (సి)పడిక్కల్ (బి)సిరాజ్ 0, లాహిరు ఉదాన (సి)జైస్వాల్ (బి)మానవ్ సుతార్ 27, ఛండీమాల్ (సి)పంత్ (బి)మానవ్ సుతార్ 4, కమిందు మెండీస్ (సి)గిల్ (బి)కుల్దీప్ 14, ధనుంజయ (సి)కెఎల్ రాహుల్ (బి)జడేజా 21, సొనాల్ దినుషా (ఎల్‌బి)జడేజా 100, డిక్వెల్లా (సి)పంత్ (బి)ప్రసిధ్ కృష్ణ 80, నువాంత (సి)గిల్ (బి)జడేజా 2, జయసూరియ (సి)జురెల్ (బి)మానవ్ సుతార్ 10, లాహిరు కుమార (స్టంప్)పంత్ (బి)మానవ్ సుతార్ 10, ఫెర్నాండో (నాటౌట్) 0, అదనం 16. (79.4ఓవర్లలో ఆలౌట్) 284పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/27, 3/53, 4/59, 5/90, 6/236, 7/243, 8/274, 9/274, 10/284
బౌలింగ్ : సిరాజ్ 9-3-29-1, ప్రసిద్ కృష్ణ 14-0-47-1, మానవ్ సుతార్ 21.4-1-76-4, కుల్దీప్ యాదవ్ 14-0-65-1, జడేజా 21-5-57-3.








కామెంట్‌లు (0)