- సయ్యద్ మోడీ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ
న్యూఢిల్లీ: సయ్యద్ మోడీ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్లు సత్తా చాటారు. టాప్‌సీడ్ లక్ష్యసేన్, 2వ సీడ్ ప్రియాన్షు రాజ్‌వత్‌తోపాటు ఆయుష్ శెట్టి, సతీశ్ కుమార్ కూడా క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-14, 21-13తో డానియేల్ డుబావెంకో(మకావు), ప్రియాన్షు 21-15, 21-9తో లీ-డ్యూ పట్(సింగపూర్)ను చిత్తుచేశారు. ఇక సతీశ్ కుమార్ 23-21, 7-3తో వాంగ్-జెంగ్(చైనా)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు. ఇక 8వ సీడ్ ఆయుష్ శెట్టి 21-12, 21-19తో మలేషియాకు చెందిన హో జస్టిన్‌ను చిత్తుచేశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-18, 21-19తో 4వ సీడ్ థారులాండ్‌కు చెందిన పోంపిచాను చిత్తుచేయగా.. మహిళల డబుల్స్‌లో 2వ సీడ్ త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ జంట 21-13, 21-10తో భారత్‌కే చెందిన భక్‌్‌త-గౌతమ్‌లను చిత్తుచేశారు. తీj ప్రి క్వార్టర్స్‌లో సింధు 21-10, 12-21, 21-15తో భారత్‌కే చెందిన ఇరా వర్మను, తస్మిన్ మీర్ 21-15, 13-21, 21-7తో భారత్‌కే చెందిన అనుమ ఉపాధ్యాయను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.