- పూరన్, మర్‌క్రమ్ విధ్వంసం
- టైటాన్స్‌పై ఆరు వికెట్లతో గెలుపుతో 3వ స్థానానికి…
లక్నో: ఈ సీజన్ ఐపిఎల్‌లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ జోరుకు లక్నో సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. తొలుత గుజరాత్‌ను 180 పరుగులకే కట్టడి చేసిన లక్నో.. ఆ లక్ష్యాన్ని 19.3ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. లక్నో బ్యాటర్లు నికోలస్ పూరన్(61), ఓపెనర్ ఎడెన్ మర్‌క్రమ్(58) అర్ధ సెంచరీలతో రాణించి లక్నో గెలుపులో కీలకపాత్ర పోషించారు. దీంతో లక్నో జట్టు చెలరేగగా 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆఖర్లో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసినా.. ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని(28 నాటౌట్), డేవిడ్ మిల్లర్(7)లు ఒత్తిడికి లోనవ్వలేదు. 20వ ఓవర్లో బౌండరీ బాదిన బదొని.. ఆ తర్వాత సిక్సర్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో, ఐదో విక్టరీకిపై కన్నేసిన గుజరాత్‌కు భంగపాటు తప్పలేదు. సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ పంజా విసిరింది. టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటన్స్‌ను ఓడించి టాప్ -4లోకి దూసుకెళ్లింది. బంతితోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించిన లక్నో మొదట ప్రత్యర్థిని 180కే కట్టడి చేసింది. ఛేదనలో ఓపెనర్లు ఎడెన్ మర్క్‌రమ్(58), కెప్టెన్ రిషభ్ పంత్()లు ధాటిగా ఆడారు. పవర్ ప్లేలో గుజరాత్ పేస్ గన్స్ సిరాజ్, ప్రసిధ్‌లను ఉతికేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో, 6 ఓవర్లలో 62 కొట్టిన లక్నో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. సుందర్ బౌలింగ్‌లో పంత్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(61: 34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు మర్క్‌రమ్ సైతం దూకుడు పెంచి 26 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు.ఈ ఇద్దరి మెరుపులతో లక్నో స్కోర్ 10 ఓవర్లకు 114కు చేరింది. విజయానికి చేరువైన లక్నోను ప్రసిధ్ దెబ్బకొట్టాడు. మర్క్‌రమ్ ఔటయ్యాక హాఫ్ సెంచరీ బాదిన పూరన్ సైతం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్(7), ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని(28 నాటౌట్)లు జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అయితే.. లక్నో విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో బదొని ఫైన్ లెగ్‌లో ఫోర్ బాదాడు. కానీ, ఆ తర్వాత సుందర్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన మిల్లర్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి ఓవర్లో 6 రన్స్ కావాలి. అబ్దుల్ సమద్(2) సింగిల్ తీయగా.. బదొని బౌండరీ కొట్టాడు.
గిల్, సాయి మెరుపులతో
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 180 రన్స్ కొట్టింది. ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(60), సాయి సుదర్శన్(56)లు మరోసారి చితక్కొట్టారు. ఎక్నాస్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అర్ధ శతకాలతో చెలరేగిన ఈ ద్వయం తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్‌కు బాటలు వేసింది. అయితే.. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత పుంజుకున్న లక్నో బౌలర్లు గుజరాత్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలవనీయలేదు. ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(22) ఒక్కడే మెరుపులు మెరిపించగా గిల్ బందం నిర్ణీత ఓవర్లలో 180 రన్స్ చేయగలిగింది.
స్కోర్‌బోర్డు…
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి)పూరన్ (బి)రవి బిష్ణోరు 56, గిల్ (సి)మార్‌క్రమ్ (బి)ఆవేశ్ ఖాన్ 60, బట్లర్ (సి)శార్దూల్ (బి)దిగ్వేష్ రాథి 16, వాషింగ్టన్ సుందర్ (బి)రవి బిష్ణోరు 2, రూథర్డ్‌ఫోర్డ్ (ఎల్‌బి)శార్దూల్ ఠాకూర్ 22, షారుక్ ఖాన్ (నాటౌట్) 11, తెవాటియా (సి)మార్‌క్రమ్ (బి)శార్దూల్ ఠాకూర్ 0, రషీద్ ఖాన్ (నాటౌట్) 4, అదనం 9. (20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 180పరుగులు.
వికెట్ల పతనం: 1/120, 2/122, 3/127, 4/145, 5/176, 6/176
బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 4-0-34-2, ఆకాశ్ దీప్ 3-0-33-0, దిగ్వేష్ రాథి 4-0-30-1, ఆవేశ్ ఖాన్ 4-0-32-1, రవి బిష్ణోరు 4-0-36-2, మార్‌క్రమ్ 1-0-15-0.
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్‌క్రమ్ (సి)శుభ్‌మన్ (బి)ప్రసిధ్ 58, పంత్ (సిసుందర్ (బి)ప్రసిధ్ 21, పూరన్ (సి)షారుక్ ఖాన్ (బి)రషీద్ ఖాన్ 61, ఆయుష్ బడోని (నాటౌట్) 28, డేవిడ్ మిల్లర్ (బి)సుందర్ 7, అబ్దుల్ సమద్ (నాటౌట్) 2, అదనం 9. (19.3ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 186పరుగులు.
వికెట్ల పతనం: 1/65, 2/123, 3/155, 4/174
బౌలింగ్: సిరాజ్ 4-0-50-0, ఆర్షాద్ ఖాన్ 2-0-11-0, ప్రసిధ్ కృష్ణ 4-0-26-2, రషీద్ ఖాన్ 4-0-35-1, సుందర్ 4-0-28-1, సాయి కిషోర్ 1.3-0-35-0.