మైస్నం మరో సంచలనం.. క్వార్టర్‌ఫైనల్‌కు చేరిక

May 16,2024 22:07 #Badminton, #Sports

బ్యాంకాక్‌: యువ షట్లర్‌ మీరాబా లువాంగ్‌ మైస్నమ్‌ మరో సంచలనం సమోదు చేశాడు. తొలిరౌండ్‌లో 9వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ ను చిత్తుచేసిన మైస్నమ్‌.. ప్రి క్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టోఫర్‌సేన్‌ను ఓడించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను మైస్నం 21-14, 21-20తో ముగించాడు. తొలిగేమ్‌ను సునాయాసంగా నెగ్గినా.. రెండోగేమ్‌ హోరాహోరీగా సాగింది. ఆ గేమ్‌ను మైస్నం 22-20తో చేజిక్కించుకొని మ్యాచ్‌ను ముగించాడు. క్వార్టర్స్‌లో 8వ సీడ్‌ విదిత్‌శరణ్‌తో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన ఏకైక షట్లర్‌ అస్మిత ఛాలిహా పోరాటం ముగిసింది. మూడుసెట్ల హోరాహోరీ పోరులో చాలీహా 15-21, 21-12, 12-21తో యు.హాన్‌(చైనా) చేతిలో పోరాడి ఓటమిపాలైంది. ఇక పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రి క్వార్టర్స్‌లో వీరు 21-16, 21-11తో చైనా షట్లర్లను ఓడించారు. క్వార్టర్స్‌లో భారత ధ్వయం మలేషియాకు చెందిన ఆర్‌కె యాప్‌-ఆంట్‌తో తలపడనున్నారు.

 

➡️