కౌలాలంపూర్: మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో మాల్విక 21-15, 21-16తో మలేషియాకు చెందిన జుహొను చిత్తుచేసింది. ఇతర పోటీల్లో ఆకర్షీ కశ్యప్ 14-21, 12-21తో డెన్మార్క్‌కు చెందిన జాకోబ్‌సేన్ చేతిలో, అనుపమ ఉపాధ్యాయ 17-21, 21-18, 8-21తో ఛో-ఛువాంగ్(ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడారు. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రాజ్‌వత్ 11-21, 16-21తో చైనా స్టార్ ఆటగాడు ఎస్.ఎఫ్.లీ చేతిలో ఓటమిపాలయ్యాడు.
రెండోరౌండ్‌కు చిరాగ్, సాత్విక్
పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. తొలిరౌండ్ పోటీలో సాత్విక్-చిరాగ్ 21-10, 16-21, 21-5తో చైనీస్ తైఫీ షట్లర్లను చిత్తుచేశారు. ఇక మహిళల డబుల్స్‌లో తానీసా కాస్ట్రో-పొన్నప్ప, పండా ధ్వయం తొలిరౌండ్‌నే నిష్క్రమించారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆథ్యా-కరుణాకరన్ జంట పరాజయాన్ని చవిచూడగా.. కాస్ట్రో-ధృవ్ కపిల జంట 21-13, 21-14తో కొరియా జంటను చిత్తుచేసి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.