MIW vs GGTW: అదరగొట్టిన హర్మన్‌..

Mar 10,2025 23:44 #Cricket, #Harmanpreet, #Sports, #WPL
  • గుజరాత్‌పై ముంబయి ఇండియన్స్‌ గెలుపు

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి జట్టు 9పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్‌పై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 179పరుగులు చేయగా.. అనంతరం గుజరాత్‌ను నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 170పరుగులకే పరిమితం చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు లభించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి శుభారంభం దక్కలేదు. మాథ్యూస్‌(27) రాణించినా.. అమేలియా కెర్ర్‌(5) నిరాశపరిచారు. దీంతో ముంబయి జట్టు 46పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్కీవర్‌-కెప్టెన్‌ హర్మన్‌ కలిసి 3వ వికెట్‌కు 59 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యంలోనే ముంబయి స్కోర్‌బోర్డు పరుగెత్తింది. నేడు జరిగే చివరి లీగ్‌లో ముంబయి గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరనుంది.

స్కోర్‌బోర్డు…
ముంబయి ఇండియన్స్‌ మహిళల ఇన్నింగ్స్‌: మాథ్యూస్‌ (సి)బెత్‌ మూనీ (బి)ప్రియా మిశ్రా 27, అమేలియా కెర్ర్‌ (రనౌట్‌)గార్డినర్‌ 5, స్కీవర్‌ బ్రంట్‌ (సి అండ్‌ బి)గార్డినర్‌ 38, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి)లిచ్‌ఫీల్డ్‌ (బి)తనుజ కన్వార్‌ 54, అమన్‌జ్యోత్‌ కౌర్‌ (సి)గార్డినర్‌ (బి)కశ్వీ గౌతమ్‌ 27, సజన (నాటౌట్‌) 11, యాస్టికా భాటియా (రనౌట్‌) డోటిన్‌/మూనీ 13, అదనం 4. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 179పరుగులు.

వికెట్ల పతనం: 1/17, 2/46, 3/105, 4/138, 5, 166, 6/179

బౌలింగ్‌: డోటిన్‌ 4-0-44-0, తనూజ కన్వార్‌ 4-0-40-1, కశ్వీ గౌతమ్‌ 4-0-32-1, ప్రియా మిశ్రా 3-0-23-1, గార్డినర్‌ 4-0-27-1, మేఘ్నా సింగ్‌ 1-0-12-0

➡️