Olympic Shooting Trials:టాప్‌లో మోద్గిల్‌ 

May 16,2024 21:06 #Olympics, #Shooting, #Sports

భోపాల్‌: అంజుమ్‌ మోద్గిల్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో సత్తా చాటుతోంది. మధ్యప్రదేశ్‌ అకాడమీలో జరుగుతున్న షూటింగ్‌ ట్రయల్స్‌లో అంజుమ్‌ 50మీ. రైఫిల్‌-3 పొజిషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 45షాట్స్‌కు గాను 463.9పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం చేజిక్కించుకున్న మోద్గిల్‌.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన సిఫ్ట్‌కౌర్‌ కంటే 1.9పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. ఇక పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన శ్రియాంక సదాంగి, నిశ్చల్‌, ఆషీ చౌక్సే టాప్‌-3లో నిలిచారు. ఇక పురుషుల రైఫిల్‌-3 పొజిషన్‌ ఈవెంట్‌లో స్వప్నిల్‌ కుశాలే 463.7పాయింట్లతో అఖిల్‌ షెరాన్‌ కంటే 2.1పాయింట్ల ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచాడు. ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌ థోమర్‌ మూడోస్థానంతో సరిపుచ్చుకున్నాడు. ఇక ఎయిర్‌ పిస్టల్‌లో మను బకర్‌ 577పాయింట్లతో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత పాలక్‌ గులియా, ఈషా సింగ్‌లకంటే ఒక పాయింట్‌ ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచింది.

➡️