రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్‌ షమీ..

టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి మైదానంలో అడుగు పెట్టి తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ంజీ ట్రోపీ 2024-25 సీజన్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 4 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్‌ చేసి 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడితో పాటు సురజ్‌ జైశ్వాల్‌, మహ్మద్‌ కైఫ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ కూడా కేవలం 228 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం బెంగాల్‌ 61 పరుగుల ఆధిక్యంలో ఉంది.

➡️