మహిళా క్రికెటర్‌ త్రిషకు రూ.కోటి నజరాన

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : అండర్‌-19 మహిళల టీ 20 ప్రపంచకప్‌లో రాణించిన గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోటి రూపాయలు నజరాన ప్రకటించారు. హైదరా బాద్‌ జూబ్లీహిల్స్‌లోని సిఎంను మర్యాద పూర్వకంగా బుధవారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమెను రేవంత్‌రెడ్డి సన్మానిం చారు. భవిష్యత్తులో దేశం తరుఫున రాణించాలని ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయలు, తెలంగాణకు చెందిన అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ టీం మెంబర్‌ ధృతి కేసరికి రూ.పది లక్షలు, హెడ్‌ కోచ్‌ నౌషీన్‌, ట్రైనర్‌ షాలినికి రూ.పది లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, సిఎం సెక్రటరీ షానవాజ్‌ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

➡️