2024 Olympics – జావెలిన్‌ త్రో ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా

పారిస్‌: భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాడు. మంగళవారం జరిగిన గ్రూప్‌ాబి క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో నీరజ్‌ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34మీ, దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఫైనల్‌కు చేరాలంటే కనీసం 84మీ. మార్క్‌ను జావెలిన్‌ను చేయాల్సి ఉండగా.. ఈ గ్రూప్‌లో నీరజ్‌దే అగ్రస్థానం. చోప్రాతోపాటు తొలి ప్రయత్నంలోనే గ్రెనెడాకు చెందిన పీటర్స్‌ అండర్సన్‌ (88.63 మీ.) రెండో స్థానం, పాకిస్థాన్‌కు నదీమ్‌ ఆర్షాద్‌(86.59మీ.) మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. బ్రెజిల్‌ అథ్లెట్‌ డా సిల్వా లూయిజ్‌ మారిసియో మూడో ప్రయత్నంలో 85.91 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. మల్దోవాకు చెందిన ఆండ్రియన్‌ మూడో ప్రయత్నంలో (84.13 మీ) ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే జావెలిన్‌ను 84మీ. దూరం విసరాలి. 8న రాత్రి 11:55గం.కు ఫైనల్‌ పోటీలు జరగనున్నాయి. భారత్‌కు చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ జెనా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గ్రూప్‌ాఎలో జెనా తొలి ప్రయత్నంలో 80.73మీ. ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 80.21 మీటర్లు విసిరాడు. గ్రూప్‌ాఎ, బిలలో కనీసం 84మీ. జావెలిన్‌ను విసిరిన త్రోయర్ల మధ్య పతక పోటీ గురువారం జరగనుంది.
ఫైనల్‌కు చేరిన త్రోయర్లు…
గ్రూప్‌ాఎ..
1. వెబేర్‌(జర్మనీ) 87.36మీ.
2. యేగో(కెన్యా) 85.97మీ.
3. వెడ్లెజిత్‌(ఛెచియా) 85.63మీ.
గ్రూప్‌ాబి..
1. నీరజ్‌ చోప్రా(భారత్‌) 89.34మీ.
2. ఆండర్సన్‌ పీటర్స్‌(గ్రెనెడా) 88.63మీ.
3. ఆర్షాద్‌ నదీమ్‌(పాకిస్తాన్‌) 86.59మీ.
4. డా సిల్వా లూయిజ్‌(బ్రెజిల్‌) 85.91మీ.

➡️