పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం ఫైనల్ బరిలో దిగనున్నాడు.టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సష్టించిన నీరజ్.. పారిస్‌లోనూ పసిడి గెలవాలని దేశం మొత్తం కోరుకుంతోంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ గురువారం రాత్రి 11.55 గంటలకు జరగనుంది. క్వాలిఫికేషన్‌లో ఒకే ఒక్క త్రోతోనే 89.34 మీటర్ల దూరం ఈటెను విసిరి నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ
ప్రత్యర్థులు ముగ్గురు నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (89.94 మీటర్లు) కన్నా మెరుగైన రికార్డును కలిగి ఉన్నారు. అండర్సన్ పీటర్సన్ (93.07 మీ-గ్రెనెడా), జులియెస్ యెగో (92.72 మీ-జర్మనీ), జాకబ్ వాద్లెచ్ (90.88 మీ-చెక్ రిపబ్లిక్)లకు నీరజ్ కంటే మెరుగైన రికార్డు ఉంది.
