నార్వే చెస్ వుమెన్-2025 టోర్నీ మే 26 నుంచి జూన్ 6 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొనున్నారు. గత కొన్నేళ్లుగా ఈ టోర్నీకి దూరంగా ఉంటున్న ఆమె ఈ సారి పోటీపడనున్నారు. వరల్డ్ క్లాసికల్ చెస్‌లో ఆరో స్థానంలో ఉన్న హంపి గతేడాది మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్ని సత్తా చాటారు. టోర్నీలో ఆడనుండటంపై హంపి బుధవారం స్పందించారు. ‘ ప్రతిష్టాత్మక నార్వే చెస్ వుమెన్ టోర్నమెంట్ ఆడటం గౌరవంగా భావిస్తున్నా..’ అన్నారు.
