సుమిత్‌ నాగల్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

Jun 10,2024 21:59 #Paris Olympics, #Sumit Nagal, #Tennis
  • ఏటిపి ర్యాంకింగ్స్‌లో 90వ స్థానం

లండన్‌: భారత టెన్నిస్‌ సంచలనం సుమిత్‌ నాగల్‌ రికార్డు నెలకొల్పాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు పురుషుల సింగిల్స్‌కు నేరుగా అర్హతసాధించాడు. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ఎటిపి) తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ 90వ ర్యాంక్‌కు ఎగబాకాడు. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌కు డైరెక్ట్‌ ఎంట్రీ లభించింది. ఎటిపి తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లోపు ఉన్న సింగిల్స్‌ క్రీడాకారులందరికీ నేరుగా ఒలింపిక్‌ బెర్త్‌ దక్కనుంది. జర్మనీ వేదికగా జరుగుతున్న నెకర్‌కప్‌-2024లో ఆదివారం స్విట్జర్లాండ్‌కు చెందిన రిచ్‌హ్యాండ్‌ను మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓడించడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. హోరాహోరీగా సాగిన ఆ పోరులో సుమిత్‌ 6-1, 6-7(5-7), 6-3తో ఓడించాడు. దీంతో అతని ఖాతాలో 713 పాయింట్లు జమ అయ్యాయి. ఇక సుమిత్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ 77.

➡️