యువ క్రికెటర్లకు సదవకాశం

Nov 6,2024 02:08
  • 8నుంచి దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా టూర్‌కు భారత యువ క్రికెటర్లు బృందం బయల్దేరి వెళ్లింది. ఈ టూర్‌లో భాగంగా భారతజట్టు దక్షిణాఫ్రికా జట్టుతో నాలుగు టి20ల సిరీస్‌ల ఆడనుంది. భారత యువ జట్టుకు కెప్టెన్‌గా మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరించనున్నాడు. ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ నవంబర్‌ 8నుంచి ప్రారంభం కానుంది.
సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టు ఇంతకుముందు శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై సిరీస్‌లను చేజిక్కించుకున్న ఉత్సాహంతో ఈ పర్యటనకు బయల్దేరి వెళ్లంది. ఈ ఏడాది వెస్టిండీస్‌-అమెరికా వేదికలుగా జరిగిన టి20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. ఆ తర్వాత పర్యటనల్లో షార్ట్‌ ఫార్మాట్‌ సిరీస్‌లో అదరగొడుతోంది. దక్షిణాఫ్రికాలోని నాలుగు వేదికల్లో టి20 సిరీస్‌ జరగనుంది. డర్బన్‌, గెబెర్హా, సెంచూరియన్‌, జొహన్నెస్‌బర్గ్‌లలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
సీనియర్‌ ఆటగాళ్లు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లగా.. యువ క్రికెటర్లతో కూడిన భారత బృందం సఫారీ గడ్డపై అడుగిడింది.

జట్లు…
ఇండియా: సూర్య కుమార్‌(కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్లు), రింకు సింగ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, వరణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, విజరు కుమార్‌ వ్యాషక్‌, ఆవేశ్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌(కెప్టెన్‌), బార్ట్‌మన్‌, కొర్ట్జే, ఫెర్రెరీ, హెడ్రిక్స్‌, జాన్సెన్‌, క్లాసెన్‌, క్రుజెర్‌, మహరాజ్‌, మిల్లర్‌, మోఘ్వానే, నాబా పేటెర్‌, రికెల్టన్‌, సిమెలనె, స్టబ్స్‌.

షెడ్యూల్‌…
నవంబర్‌ 8 : తొలి టి20 డర్బన్‌ రా.8.30గం||లకు
నవంబర్‌ 10 : రెండో టి20 గెబెర్హా రా.7.30గం||లకు
నవంబర్‌ 13 : మూడో టి20 సెంచూరియన్‌ రా. 8.30గం||లకు
నవంబర్‌ 15 : నాల్గో టి20 జొహన్నెస్‌బర్గ్‌ రా.8.30గం||లకు

➡️