ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపింది. హైబ్రిడ్ విధానానికి ఒప్పుకునేందుకు పిసిబి ఐసీసీకి షరతులు పెట్టింది. 2031 వరకు అన్ని ఈవెంట్స్‌కు ఐసిసి అదే విధానాన్ని అమలు చేయాలని.. అలా చేస్తే హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించి దూబారులో భారత్‌తో ఆడేందుకు సిద్ధమని పాక్ బోర్డు తెలిపింది. అలాగే భవిష్యత్‌లో ఏ టోర్నమెంట్ అయినా భారత్‌లో ఆడాల్సి వస్తే.. తాము కూడా హైబ్రిడ్ మోడ్‌లోనే ఆడతామని పాక్ స్పష్టం చేసింది.