పారా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్
కేంద్ర క్రీడల శాఖల ఆధ్వర్యంలో వీడ్కోలు సభ
పారిస్: పారా ఒలింపిక్స్‌లో భారత ప్రారంభోత్సవ వేడుకల పతక ధారులుగా భాగ్యశ్రీ జాధవ్, సుమిత్ అంతిమ్ వ్యవహరించనున్నారు. 84మంది అథ్లెట్లతో కూడిన భారత బృందం ముందు వీరు నడవనున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఎ) శుక్రవారం వీడ్కోలు సభను నిర్వహించింది. కేంద్ర క్రీడల శాఖామంత్రి డా.మన్సుక్ మాండవీయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పారా ఒలింపిక్ ఆఫ్ ఇండియా(పిసిఐ) అధ్యక్షులు, పారా ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన దేవేంద్ర ఝజారియా భారత బృందంతో వెళ్లనున్నారు. పారా ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలకు ఫ్లాగ్‌బేరర్లుగా మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంతిల్ వ్యవహరించనున్నారు. జాధవ్ షాట్‌ఫుట్ క్రీడాకారిణి కాగా.. ఎఫ్ 34 కేటగిరీలో నిలకడైన ప్రదర్శన చేస్తోంది. జావెలిన్‌త్రో స్టార్ సుమిత్ అంతిల్ ఎఫ్ 64 కేటగిరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టోక్యో పారా ఒలింపిక్స్‌లో అతడు 68.55 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. 2020 టోక్యో పారాఒలింపిక్స్‌లో భారత్ 54మంది అథ్లెట్లతో వెళ్లి.. 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో సహా మొత్తం 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. పారిస్‌లో పారా ఒలింపిక్స్ ఆగస్టు 28నుంచి సెప్టెంబర్ 8వరకు జరగనున్నాయి.
పారా ఒలింపిక్స్‌కు భారత బృందం ఇదే..
ఆర్చరీ: హర్విందర్ సింగ్, రాకేశ్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి, పూజ, సరిత, షీతల్ దేవి
అథ్లెటిక్స్: దీప్తి జీవాంజి, సుమిత్ అంతిల్, సందీప్, అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, నవ్‌దీప్, యోగేశ్, ధరంబిర్, అమిత్ కుమార్, నిషాద్ కుమార్, రామ్ పాల్, మరియప్పన్ తంగవేలు, శైలేష్ కుమార్, శరద్ కుమార్, సచిన్ సర్జేరావు ఖిలారి, మహమ్మద్ యాసెర్, రోహిత్ కుమార్, ప్రీతి పాల్, భాగ్యశ్రీ మాధవ్‌రావు జాధవ్, మను, ప్రవీణ్‌కుమార్, రవి రొంగలి, సందీప్ సంజరు గుర్జార్, అరవింద్, దీపేశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, దిలీప్ మహదు సోమన్ రానా, హొకటో సేమ, సాక్షి కసానా, కరమ్ జ్యోతి, రక్షిత రాజు, అమిషా రావత్, భవనాబెన్, సిమ్రన్, కంచన్ లఖాని
బ్యాడ్మింటన్: మనోజ్ సర్కార్, నితేశ్ కుమార్, కష్ణ నగర్, శివరాజన్ సోలైమలై, సుహాస్ యతిరాజ్, సుకాంత్ కాదమ్, తరుణ్, మానసి జోషి, మన్‌దీప్ కౌర్, పాలక్ కోహ్లీ, మనీషా రామదాస్, తులసిమతి మురుగేశన్, నిత్యశ్రీ శివన్
కనావో: ప్రాచీ యాదవ్, యశ్ కుమార్, పూజా
సైక్లింగ్: అర్షద్ షైక్, జ్యోతి గడేరియా
బ్లైండ్ జూడో: కపిల్ పర్మార్, కోకిలా
పవర్ లిఫ్టింగ్: పరమ్‌జీత్ కుమార్, అశోక్, శకినా ఖతున్, కస్తూరి రాజమణి
రోయింగ్: అనిత, నారాయణ కొంగనపల్లె
షూటింగ్: అమిత్ అహ్మద్ భట్, అవని లేఖర, మోనా అగర్వాల్, నిహాల్ సింగ్, మనీశ్ నర్వాల్, రుద్రాంక్ష్, సిద్ధార్థ్ బాబు, శ్రీహర్ష దేవరద్ది రామకష్ణ, స్వరూప్ మహవీర్, రుబినా ఫ్రాన్సిస్
స్విమ్మింగ్: సుయాశ్ నారాయణ్ జాధవ్
టేబుల్ టెన్నిస్: సోనాల్‌బెన్ పటేల్, భవినాబెన్ పటేల్.