నేటి నుండి పారాగ్లైడింగ్‌ ప్రపంచకప్‌ టోర్నీ – 32 దేశాల నుండి ఆటగాళ్లు

హిమాచల్‌ ప్రదేశ్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బీడ్‌ బిల్లింగ్‌ వ్యాలీలో శనివారం నుండి పారాగ్లైడింగ్‌ ప్రపంచకప్‌ టోర్నీని రెండోసారి నిర్వహించనున్నారు. పారాగ్లైడింగ్‌ ప్రపంచకప్‌ నవంబర్‌ 2 నుంచి 9 వరకు జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ఎస్‌ బాలి టేకాఫ్‌ సైట్‌ బిల్లింగ్‌లో హవన్‌ యాగం తర్వాత ప్రారంభోత్సవం చేస్తారు. 32 దేశాల నుంచి దాదాపు 100 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. పాల్గనేవారి తుది జాబితాను నేటి ఉదయం విడుదల చేస్తారు. దీని తరువాత, పాల్గొనేవారికి బిల్లింగ్‌ ఆకాశం నుండి గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారు.

భద్రత కోసం రెస్క్యూ, సెక్యూరిటీ టీంలు.. హెలికాప్టర్‌ సేవలు ….
మొదటి రోజు ట్రయల్‌ టాస్క్‌లు మాత్రమే ఉంటాయి. బిల్లింగ్‌ పారాగ్లైడింగ్‌ అసోసియేషన్‌ (బీపీఏ) ప్రెసిడెంట్‌ అనురాగ్‌ శర్మ మాట్లాడుతూ … 2015 తర్వాత రెండోసారి ప్రపంచకప్‌ బిల్లింగ్‌లో జరగబోతోందన్నారు. భారతదేశంలో పారాగ్లైడింగ్‌ ప్రపంచ కప్‌ బిల్లింగ్‌లో మాత్రమే నిర్వహించబడిందని, ఇప్పటికే పారాగ్లైడింగ్‌ వరల్డ్‌ కప్‌ అధికారులు బీడ్‌ చేరుకున్నారని తెలిపారు. పాల్గొనే వారందరికీ ప్రతిరోజూ ప్రయాణించడానికి ఒక టాస్క్‌ ఇవ్వబడుతుందని, దీని దూరం 50 నుండి 130 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పారు. పాల్గొనేవారి భద్రత కోసం రెస్క్యూ, సెక్యూరిటీ టీమ్‌లు ఉంటాయని, అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శనివారం సాయంత్రం ల్యాండింగ్‌ సైట్‌లో సాంస్కఅతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని వివరించారు.

ప్రపంచ కప్‌ను గుర్తించిన పారాగ్లైడింగ్‌ వరల్డ్‌ కప్‌ అసోసియేషన్‌ …
ప్రపంచ కప్‌ను పారాగ్లైడింగ్‌ వరల్డ్‌ కప్‌ అసోసియేషన్‌ గుర్తించింది. అలాగే ఫెడరేషన్‌ ఏరోనాటిక్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా కేటగిరీ 2 ఈవెంట్‌గా రేట్‌ చేయబడింది. ఏరో క్లబ్‌ ఆఫ్‌ ఇండియా కూడా దీన్ని గుర్తించింది. అమెరికా, ఇంగ్లాండ్‌, చైనా, భారతదేశం, రష్యా, నెదర్లాండ్స్‌, కొరియా, మలేషియా, బ్రెజిల్‌, సింగపూర్‌, ఫ్రాన్స్‌, వియత్నాం, కజకిస్తాన్‌, పోలాండ్‌, ఇరాన్‌, హంగరీ, తైపీ, నేపాల్‌, ఇజ్రాయెల్‌ ఇంకా బంగ్లాదేశ్‌తో సహా ఇతర దేశాల నుండి పాల్గనేవారు ప్రపంచ కప్‌లో పాల్గంటారు. వీక్షకుల కోసం వైమానిక సాహస క్రీడలు, మారథాన్‌, సైక్లింగ్‌కు సంబంధించిన అనేక విన్యాసాలు కూడా నిర్వహించబడతాయి. ఇప్పటికే టోర్నీ సందడి అక్కడ నెలకొంది.

➡️