ఈషా, మనుకు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌లు

May 13,2024 21:37 #Sports

పురుషుల విభాగంలో మరో ఇద్దరు కూడా..
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌
భోపాల్‌: పారిస్‌ ఒలింపిక్స్‌కు మరో ఇద్దరు భారత షూటర్లు అర్హత సాధించారు. ఎంపి షూటింగ్‌ ఆకాడమీలో జరిగిన 25మీ. మహిళల పిస్టల్‌ విభాగంలో ఈ రెండు బెర్తులు భారత్‌కు దక్కాయి. సోమవారం జరిగిన 25మీ. మహిళల పిస్టల్‌ విభాగంలో ఈషా సింగ్‌, మను బకర్‌తోపాటు అనీష్‌ భన్వాలా, విజరు వీర్‌ సింగ్‌లు కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మహిళల 25మీ. పిస్టల్‌ విభాగంలో ఇషా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి ఒఎస్‌టి టిా3లో 43పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మను 40పాయింట్లతో రెండోస్థానంలో, రిథమ్‌ సాంగ్వాన్‌ మూడోస్థానంలో నిలిచారు. ఇక పురుషుల 25మీ. పిస్టల్‌ కేటగిరీలో అనీష్‌ భన్వాలా, ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో విజరు వీర్‌ సింగ్‌ మొత్తం 36పాయింట్లతో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్నారు.

➡️