పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈసారి అత్యధిక పతకాలు దక్కే ఛాన్స్ ఉంది. పతకాలకోసం అత్యుత్తమ క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలో 2024 ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లలో అతి పిన్న వయస్కుడిగా స్విమ్మర్ 14ఏళ్ల ధీనిధి నిలువగా.. అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బొప్పన్న(టెన్నిస్) 44ఏళ్లు ఉన్నారు. వీరిద్దరి మధ్య 30ఏళ్ల వయసు అంతరం ఉంది. మహిళల 200మీ. ఫ్రిస్టైల్ విభాగంలో భారతజట్టులో థీనిధి ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయనున్నారు. ఆమె 2023 స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో 2నిమిషాల 04.24సెకన్లలో గమ్యానికి చేరి జాతీయ రికార్డును బ్రేక్ చేసింది. అలాగే ఆర్చరీ మహిళల రికర్వు విభాగంలో భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్‌కు తొలి బెర్త్‌ను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈషా సింగ్(19) షూటింగ్ విభాగంలో భారత్ తరఫునుంచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మరో అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. ఈనెల 26నుంచి ఆగస్టు 11వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే.
