భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ ఒలింపిక్స్ నుంచి ఔట్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆమె తన సోదరిని ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడమేనని దీనికి కారణం. ఇప్పటికే అంతిమ్ అక్రిడిటేషన్‌ను నిర్వాహకులు రద్దు చేయగా.. ఆమెపై చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతిమ్ ఫ్రీస్టైల్ 53 కేజీల కేటగిరీలో క్వార్టర్స్‌లో తుర్కియే రెజ్లర్ యెట్‌గిల్ చేతిలో ఓడిపోయింది.
