paris olympics: టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌.. ప్రి క్వార్టర్స్‌కు ఆకుల శ్రీజ

Jul 31,2024 16:18 #2024 Paris Olympics, #Table Tennis

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో ఐదోరోజు బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌ చేరగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ సైతం రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాడు. మరోవైపు.. ఉమెన్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో ఆకుల శ్రీజ కూడా రౌండ్‌ ఆఫ్‌ 16లో అడుగుపెట్టింది. బుధవారం నాటి మ్యాచ్‌లో శ్రీజ.. సింగపూర్‌కు చెందిన జియాన్‌ జెంగ్‌తో తలపడింది. తొలి గేమ్‌లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక భారత్‌ నుంచి మరో టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌ చేరుకున్న విషయం తెలిసిందే.

➡️