ఆంటిగ్వా: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ ప్రపంచ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. 2024లో క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లో 27 పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్ (2,036 పరుగులు.. 45 ఇన్నింగ్స్‌లు.. 2021) రికార్డును బ్రేక్ చేశాడు. నికోలస్ పూరన్ ఈ ఏడాది ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 2,059 పరుగులు చేశాడు.
క్యాలండర్ ఇయర్‌లో టి20ల్లో అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాళ్లు..
– నికోలస్ పూరన్- 2,059 పరుగులు.. 65 ఇన్నింగ్స్‌లు (2024)
– మహ్మద్ రిజ్వాన్ – 2,036 పరుగులు.. 45 ఇన్నింగ్స్‌లు (2021)
– అలెక్స్ హేల్స్- 1,946 పరుగులు.. 61 ఇన్నింగ్స్‌లు (2022)
– జోస్ బట్లర్ – 1,833 పరుగులు.. 55 ఇన్నింగ్స్‌లు (2023)
– మహ్మద్ రిజ్వాన్ – 1,817 పరుగులు.. 44 ఇన్నింగ్స్‌లు (2022)